‘కేసీఆర్‌ సర్‌.. నిన్ను నాయినా అని పిలవనా?’

నటుడు, రచయిత ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెరపై వైవిధ్య పాత్రల్లో కనిపించి మెప్పించే ఈ నటుడిలో గొప్ప రచయిత దాగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత, వాస్తవిక సంఘటనలపై తన అంతరంగంలో మెదిలిన భావాలను సూటిగా, నిక్కశ్చిగా చెప్పడం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతంలో షార్ట్‌ కట్‌ అంటూ మానవాళి చేస్తున్న తప్పిదాలను ఉత్తేజ్‌ వేలెత్తి చూపించాడు. తాజాగా తెలంగాణ గడ్డపై కరోనా బారి నుంచి ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ, వారికి అండగా నిలుస్తూ భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలచేశాడు. తన పదునైన, గుండెబరువెక్కె విధంగా ఉత్తేజ్‌ పలికిన మాటలు అందరని ఆకట్టుకునే,ఆలోచించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తేజ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.